Pages

aMdariki nekkuDaina - అందరికి నెక్కుడైన

అందరికి నెక్కుడైన (రాగం: ) (తాళం : )
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

aMdariki nekkuDaina (Raagam: ) (Taalam: )
aMdariki nekkuDaina hanumaMtuDu
aMdukone sUryaphalamani hanumaMtuDu

balliduDai laMkajochchi balurAkAsula goTTi
hallakallOlamu chEse hanumaMtuDu
vollane rAmula mudduTuMgaramu sIta kichche
allade niluchunnADu hanumaMtuDu

dAkoni yAkemuMdara tanagu~ru terugiMchi
AkAramaTu chUpe hanumaMtuDu
chEkoni SirOmaNi chEtabaTTi jalanidhi
AkasAna dATivachche hanumaMtuDU

koMkakiTTe saMjIvi koMDa dechchi ripulaku
naMkakADai nilichenu hanumaMtuDu
teMkinE SrIveMkaTAdri dEvuni meppiMchinADu
aMke kalaSApurapu hanumaMtuDu

aMdari bradukulu nAtanivE - అందరి బ్రదుకులు నాతనివే

అందరి బ్రదుకులు నాతనివే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందరి బ్రదుకులు నాతనివే | కందువెల్ల శ్రీకాంతునిదే ||

చ|| వేమరు జదివెడి విప్రుల వేదము | సోమకవైరి యశో విభవం |
శ్రీమించు నమరుల జీవనమెల్ల సు- | ధామ ధనుని సంతత కరుణే ||

చ|| హితవగు నిలలో నీసుఖమెల్లను | దితి సుత దమనుడు దెచ్చినదే |
తతి తల్లి దండ్రి తానై కాచిన | రతి ప్రహ్లాద వరదుని కృపే ||

చ|| అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు | బలి బంధను కృప బరగినవే ||
బలసి మునుల యాపదలు వాపుటకు | బలునృప భంజను పరిణతలే ||

చ|| పూని యనాథుల పొందుగ గాచిన | జానకీ విభుని సరసతలే |
నానా భూభరణంబులు నందుని | సూనుడు చేసిన సుకృతములే ||

చ|| తలకొని ధర్మము తానై నిలుపుట | కలుష విదూరుని గర్వములే |
నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు | కలియుగమున వేంకటపతివే ||

aMdari bradukulu nAtanivE (Raagam: ) (Taalam: )
pa|| aMdari bradukulu nAtanivE | kaMduvella SrIkAMtunidE ||

ca|| vEmaru jadiveDi viprula vEdamu | sOmakavairi yaSO viBavaM |
SrImiMcu namarula jIvanamella su- | dhAma dhanuni saMtata karuNE ||

ca|| hitavagu nilalO nIsuKamellanu | diti suta damanuDu deccinadE |
tati talli daMDri tAnai kAcina | rati prahlAda varaduni kRupE ||

ca|| alarina yamarEMdrAdula bradukulu | bali baMdhanu kRupa baraginavE ||
balasi munula yApadalu vApuTaku | balunRupa BaMjanu pariNatalE ||

ca|| pUni yanAthula poMduga gAcina | jAnakI viBuni sarasatalE |
nAnA BUBaraNaMbulu naMduni | sUnuDu cEsina sukRutamulE ||

ca|| talakoni dharmamu tAnai nilupuTa | kaluSha vidUruni garvamulE |
 nilici lOkamulu nilipina GanuDagu | kaliyugamuna vEMkaTapativE ||

aMdarikAdhAramaina - అందరికాధారమైన

అందరికాధారమైన ఆది (రాగమ్: ) (తాలమ్: )
ప|| అందరికాధారమైన ఆది పురుషుడీతడు | విందై మున్నారగించె విదురునికడ నీతుడు ||

చ|| సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు | వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు | మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||

చ|| సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు | ధరనావుల మందలలో తగ జరించె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు | ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ||

చ|| పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు | సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు |
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు | వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||

aMdarikAdhAramaina Adi (Raagam: ) (Taalam: )
pa|| aMdarikAdhAramaina Adi puruShuDItaDu | viMdai munnAragiMce vidurunikaDa nItuDu ||

ca|| sanakAdulu koniyADeDi sarvAtmakuDItaDu | vanaja BavAdulakunu daivaMbai nataDItaDu | inamaMDalamuna jelagETihitavai BavuDitaDu | munupuTTina dEvatalaku mUlaBUti yItaDu ||

ca|| sirulosagi yaSOdayiMTa SiSuvainata DItaDu | dharanAvula maMdalalO taga jariMce nItaDu | sarasatalanu golletalaku janavulosage nItaDu | Arasi kucEluni yaDukulu AragiMcenItaDu ||

ca|| paMkajaBavunakunu brahma pada mosagenu yItuDu | saMkIrtana lAdyulacE jaTTi goniyenItaDu | teMkiga nEkAlamu paradEvuDaina yItaDu | vEMkaTagiri mIda praBala velasina GanuDItaDu ||

aMtaryAmi alasiti - అంతర్యామి అలసితి

అంతర్యామి అలసితి (రాగమ్:శివ రంజని )(తాలమ్: )
ప|| అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

చ|| కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

చ|| జనుల సంగముల జక్క రోగములు | విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము | చనదది నీవిటు శాంతపరచక ||

చ|| మదిలో చింతలు మైలలు మణుగులు | వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె | అదన గాచితివి అట్టిట్టనక ||


aMtaryAmi alasiti (Raagam:Sivara~njani ) (Taalam: )
pa|| aMtaryAmi alasiti solasiti | iMtaTa nI SaraNide joccitini ||

ca|| kOrina kOrkulu kOyani kaTlu | tIravu nIvavi teMcaka |
BArapu baggAlu pApa puNyamulu | nErupula bOnIvu nIvu vaddanaka ||

ca|| janula saMgamula jakka rOgamulu | vinu viDuvavu nIvu viDipiMcaka |
vinayapu dainyamu viDuvani karmamu | canadadi nIviTu SAMtaparacaka ||

ca|| madilO ciMtalu mailalu maNugulu | vadalavu nIvavi vaddanaka |
eduTane SrI veMkaTESvara nIvade | adana gAcitivi aTTiTTanaka ||


aMtarumAlinayaTTi - అంతరుమాలినయట్టి

అంతరుమాలినయట్టి అధములాల (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంతరుమాలినయట్టి అధములాల | పొంత సంతకూటమి పొరిచూపు గాదా ||

చ|| కనక మిత్తడితోడ కలయ సరిదూచితే | అనువవునా అది దోష మవుగాక |
ఘనుడైనహరితో గడుహీనదేవతల | ననిచి సరివేట్టితే నయ మవునా భువిని ||

చ|| పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై | వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱులేకారా |
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల | బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా ||

చ|| కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా | పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక |
 అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను | కొంచెపుదైవాల పలువంచలనేకాక ||

aMtarumAlinayaTTi(Raagam: ) (Taalam: )
pa|| aMtarumAlinayaTTi adhamulAla | poMta saMtakUTami poricUpu gAdA ||

ca|| kanaka mittaDitODa kalaya saridUcitE | anuvavunA adi dOSha mavugAka |
GanuDainaharitO gaDuhInadEvatala | nanici sarivETTitE naya mavunA Buvini ||

ca|| paTTaBadruDu gUrcuMDEbalusiMhAsanamupai | veTTibaMTu beTTEvAru verxrxulEkArA | gaTTigA SrIharitODa kalagaMpadEvatala | beTTi kolucuTa viMduveTTi pagagAdA ||

ca|| koMcaka siMhamuMDETiguha nuMDavaccunA | poMci nakkalakella bokkalEkAka |
aMcela SrIvEMkaTESu DAtmalOnE vuMDagAnu | koMcepudaivAla paluvaMcalanEkAka ||


aMtaraMgamella SrIhariki - అంతరంగమెల్ల శ్రీహరికి

అంతరంగమెల్ల శ్రీహరికి(రాగమ్: )(తాలమ్: )
ప|| అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె | వింతవింత విధముల వీడునా బంధములు ||

చ|| మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా | తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా |
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా | పనిమాలి ముదిసితే పాసెనా భవము ||

చ|| చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా | పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా |
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా | ఎదుట తాను రాజైతే ఏలెనాపరము ||

చ|| పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా | జీవించి ఫలమేది చింత దీరుదాకా |
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా | భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా ||

aMtaraMgamella SrIhariki (Raagam: ) (Taalam: )
pa|| aMtaraMgamella SrIhariki oppiMcukuMTe | viMtaviMta vidhamula vIDunA baMdhamulu ||

ca|| manujuDai PalamEdi marij~jAni yaudAkA | tanuvetti PalamEdi dayagalugudAkA |
dhanikuDai PalamEdi dharmamu sEyudAkA | panimAli mudisitE pAsenA Bavamu ||

ca|| cadiviyu PalamEdi SAMtamu kalugudAkA | pedavetti PalamEdi priyamADu dAkA |
madigalgi PalamEdi mAdhavudalacu dAkA | eduTa tAnu rAjaitE ElenAparamu ||

ca|| pAvanuDai PalamEdi Bakti kaliginadAkA | jIviMci PalamEdi ciMta dIrudAkA |
vEvEla PalamEdi vEMkaTESu gannadAkA | BAviMcitA dEvuDaitE pratyakShamaunA ||


anjanEya anilaja - అంజనేయ అనిలజ

అంజనేయ అనిలజ (రాగం:) (తాళం : )
అంజనేయ అనిలజ హనుమంతా
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతా
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
నీ రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా

anjanEya anilaja (Raagam: ) (Taalam: )
anjanEya anilaja hanumantA
Sree aamjanaeya anilaja hanumamtaa
Sree aamjanaeya anilaja hanumamta
nee ramjakapu chaetalu suralakemta vaSamaa
taerimeeda nee roopu techchipetti aarjunuDu
kauravula gelichae samgara bhoomini
saareku bheemuDu purushaamRgamu techchu chOTa
neerOmamulu kaavaa nikhila kaaraNamu
nee moolamunagaadE nelavai sugreevuDu
raamuni golichi kapiraajaayenu
raamuDu nee vamkanaepO ramaNi seetaa daevi
praemamutO maguva pemDlaaDenu
baludaityulanu dumcha bamTu tanamu mimcha
kalakaalamununemcha kaligitigaa
ala SreevaemkaTapati amDane mamgaambudhi
nilayapu hanumamta negaDitigaa

aMcita puNyulakaitE - అంచిత పుణ్యులకైతే

అంచిత పుణ్యులకైతే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక | పంచమహాపాతకులభ్రమ వాపవశమా ||
చ|| కాననియజ్ఞానులకు కర్మమే దైవము | ఆనినబద్ధులకు దేహమే దైవము |
మాననికాముకులకు మగువలే దైవము | పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ||
చ|| యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము | దోమటిసంసారి కూరదొర దైవము |
తామసులకెల్లాను ధనమే దైవము | పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా ||
చ|| ధన నహంకరులకు తాదానే దైవము | దరిద్రుడైనవానికి దాత దైవము |
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము | పరులముంచినయట్టి భ్రమ బాపవశమా ||


aMcita puNyulakaitE (Raagam: ) (Taalam: )
pa|| aMcita puNyulakaitE hari daivamavugAka | paMcamahApAtakulaBrama vApavaSamA ||
ca|| kAnaniyaj~jAnulaku karmamE daivamu | Aninabaddhulaku dEhamE daivamu |
mAnanikAmukulaku maguvalE daivamu | pAnipaTTi vArivAriBrama mAnpavaSamA ||
ca|| yEmI nerxuganivAri kiMdriyamulu daivamu | dOmaTisaMsAri kUradora daivamu |
tAmasulakellAnu dhanamE daivamu | pAmarula baTTinaTTiBrama bApavaSamA ||
ca|| dhana nahaMkarulaku tAdAnE daivamu | daridruDainavAniki dAta daivamu |
yiravai mAku SrIvEMkaTESuDE daivamu | parulamuMcinayaTTi Brama bApavaSamA ||

aMtaTane vachchi - అంతటనె వచ్చి

అంతటనె వచ్చి (రాగం:కాంభోది ) (తాళం : )
అంతటనే వచ్చికాచు నాపద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||పల్లవి||
బంతిగట్టినురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారముసేయునరు డందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||అంత||
వరుస జేదుదినేవాడు యెడ నెడ గొంత
సరవితోడుత దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించుమానవుడు
తరువాత హరిపేరు దలచుటే చాలు ||అంత||
కడు బేదైనవాడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరగక గురువాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు ||అంత|||

aMtaTane vachchi (Raagam: kaambhOdi ) (Taalam: )

aMtaTanE vachchikAchu nApadbhaMdhuDu hari
vaMtuku vAsiki natanivADanaMTEjAlu ||pallavi||
baMtigaTTinuripETi pasuramu leDaneDa
boMta nokkokka gavuka vuchchukonnaTTu
cheMtala saMsAramusEyunaru DaMdulOne
koMtagoMta harinAtma goluchuTE chAlu ||aMta||
varusa jEdudinEvaaDu yeDa neDa gonta
saravitODuta deepu chavigonnaTTu
duritavidhulu sEsi du@hkhinchumAnavuDu
taruvaata haripEru dalachuTE chaalu ||aMta||
kaDu bEdainavaaDu kaalakarmavaSamuna
aDugulOnE nidhaana maTu gannaTTu
yeDasi SreeVEnkaTESu neragaka guruvaaj~na
poDagannavaanibhakti poDamuTE chAlu ||aMta|

aMTabAri paTTukOrE - అంటబారి పట్టుకోరే

అంటబారి పట్టుకోరే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె | వెంటబారనీదు నన్ను వెడమాయతురుము ||
చ|| కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి | లేగల దోలుకొని అలిగిపోయీని | రాగతనమున వాడె రాతిరి నారగించడు | ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను ||
చ|| కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి | కలవూరుగాయలెల్ల గలచిపెట్టె | పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె | చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను ||
చ|| మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు | ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును | వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె | యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను ||

aMTabAri paTTukOrE (Raagam: ) (Taalam: )
pa|| aMTabAri paTTukOrE ammalAla yide | veMTabAranIdu nannu veDamAyaturumu ||
ca|| kAgeDuperugucADe kavvamutO boDici | lEgala dOlukoni aligipOyIni | rAgatanamuna vADe rAtiri nAragiMcaDu | Agi nannu gUDaDige nayyO iMdAkanu ||
ca|| koladigAniperugu kosarikosari pOri | kalavUrugAyalella galacipeTTe | palukaDu cEticaTTi pAravEsi pOyInade | celagucu mUTagaTTe jellabO yiMdAkanu ||
ca|| maTTupaDakiTu nUrumArulainA nAragiMcu | iTTe yiMdarilOna ninnALLunu | veTTiki nAkorakugA vEMkaTESu DAragiMce | yeTTu nEDAkaTa dhariyiMcenO yiMdAkanu ||

aMganalAla manacE - అంగనలాల మనచే

అంగనలాల మనచే (రాగమ్: ) (తాలమ్: )
ప|| అంగనలాల మనచే నాడించుకొనెగాని | సంగతెఱిగిననెరజాణ డితడే ||
చ|| వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని | తడయక పురుషోత్తము డితడే | బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని | వెడలించె నమృతము విష్ణుడితడే ||
చ|| పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని | నలువంక లక్ష్మీనాథు డితడే | చలికి గోవరివానివరుస బావాయగాని | పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే ||
చ|| యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని | తక్కకవెదకేపరతత్త్వ మితడే | మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని | తక్కక వేదముచెప్పేదైవమీతడే ||


aMganalAla manacE (Raagam: ) (Taalam: )
pa|| aMganalAla manacE nADiMcukonegAni | saMgaterxiginanerajANa DitaDE ||
ca|| voDalulEnivAni kokkaDE taMDrAyagAni | taDayaka puruShOttamu DitaDE | baDabAgnijaladhiki bAyakalluDAyagAni | veDaliMce namRutamu viShNuDitaDE ||
ca|| puligUDudinnavAnipoM dokkaTE sEsegAni | naluvaMka lakShmInAthu DitaDE | caliki gOvarivAnivarusa bAvAyagAni | paludEvatalakella prANabaMdhu DitaDE ||
ca|| yekkaDO gollasatula kiMTimagaDAyagAni | takkakavedakEparatattva mitaDE | mikkili SrIvEMkaTAdrimIda mammu nElegAni | takkaka vEdamuceppEdaivamItaDE ||


Learn English Vocabulary & Help the Poor| Link 4 |